PAK vs WI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన పాకిస్తాన్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేశాడు

23 May, 2022 17:48 IST|Sakshi

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టకు బాబర్‌ ఆజాం సారథ్యం వహించనున్నాడు. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్‌ షాదాబ్ ఖాన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

కాగా ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌కు 21 మంది సభ్యులను ఎంపిక చేసిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సెలెక్టర్లు .. ఈ సారి ఆ సంఖ్యను 16కు తగ్గించారు. దీంతో జట్టుకు ఆసిఫ్ అఫ్రిది, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఉస్మాన్ ఖాదిర్ వంటి ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి వన్డే రావల్పిండి వేదికగా జూన్‌ 8న జరగనుంది.

పాకిస్తాన్‌ జట్టు
బాబర్ ఆజాం(కెప్టెన్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, షాహీన్ షా ఆఫ్రిది, షానవాజ్ దహానీ, జాహిద్ మహమూద్

చదవండి: IPL 2022: ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయితే..?

మరిన్ని వార్తలు