వైరల్‌: ఏంటా వేగం.. బ్యాట్‌ రెండు ముక్కలైంది

6 Apr, 2021 10:47 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫఖర్‌ జమాన్‌ రనౌట్‌ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఈ అంశంపై చర్చ నడుస్తున్న సమయంలోనే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి జరగింది వివాదాస్పద అంశం మాత్రం కాదు.. కాసేపు ఫన్నీగా నవ్వుకునే అంశం జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సమయంలో పాక్‌ పేసర్‌ ఫహీమ్‌ అష్రఫ్‌ వేసిన బంతి దాటికి ప్రొటీస్‌ బ్యాట్స్‌మన్‌ బవుమా బ్యాట్‌ రెండు ముక్కలైంది. ఇన్నింగ్స్‌  16వ ఓవర్‌లో అష్రఫ్‌ వేసిన మూడో బంతిని బవుమా డిఫెన్స్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అష్రఫ్‌ వేసిన బంతి131 కిమీ వేగంతో వచ్చి బ్యాట్‌కు తగలడంతో బ్యాట్‌ పైభాగం ఊడి కిందపడిపోయింది. దీంతో షాక్‌కు గురవ్వడం బవుమా వంతైంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటన చోటుచేసుకున్నప్పుడు బవుమా 31 పరుగుల వద్ద ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. బవుమా 92, డికాక్‌ 80, వాండర్‌ డసెన్‌ 60, మిల్లర్‌ 50 నాటౌట్‌ రాణించారు. అనంతరం 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ 193 పరుగులు అసాధారణ ఇన్నింగ్స్‌తో పాక్‌ మ్యాచ్‌ను గెలిచేలా కనిపించింది. అయితే వివాదాస్సద రనౌట్‌తో జమాన్‌ వెనుదిరగడంతో పాక్‌ ఓటమి ఖరారైంది.

చదవండి: అతను మీ గన్‌డెత్‌ బౌలర్‌ కాకపోవచ్చు.. కానీ

మరిన్ని వార్తలు