Mohammad Hasnain: పాక్ స్టార్‌ బౌలర్‌పై సస్పెన్షన్ వేటు.. ఇక పై!

4 Feb, 2022 12:30 IST|Sakshi

పాకిస్తాన్ స్టార్ పేస‌ర్  మహ్మద్ హస్నైన్‌పై ఐసీసీ సస్పెన్షన్‌ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ శుక్ర‌వారం అధికారికంగా ద్రువీక‌రించింది. "క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ రిపోర్టు మాకు అందింది. ఈ పరీక్షల్లో అతడు బంతిని విసిరేటప్పుడు 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో మోచేతిని వంచుతున్నట్లు తేలింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బౌలింగ్ నిపుణులతో అత‌డి రిపోర్టు గురించి చ‌ర్చించి, అత‌డి స‌మ‌స్య‌ను పరిష్కరిస్తుంది. అత‌డి కోసం ప్ర‌త్యేకంగా బౌలింగ్ కన్సల్టెంట్‌ను నియ‌మిస్తాం" అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒక‌రు పేర్కొన్నారు. ఇక మహ్మద్ హస్నైన్ ప్ర‌స్తుతం పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. అయితే ఇకపై మహ్మద్ హస్నైన్‌ని జ‌ట్టులో కొనసాగించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

చ‌ద‌వండి: Ashes: ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఘోర పరాభవం.. హెడ్‌కోచ్‌పై వేటు.. మాజీ కెప్టెన్‌కు కీలక బాధ్యతలు!

మరిన్ని వార్తలు