Asia Cup 2022 IND Vs PAK: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. వెన్నునొప్పితో కీలక బౌలర్‌ దూరం!

26 Aug, 2022 16:19 IST|Sakshi
Photo Credit: ICC Twitter

ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ వసీమ్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాక్టీస్‌ సమయంలో బౌలింగ్‌ సెషన్‌లో పాల్గొన్న మహ్మద్‌ వసీమ్‌ బౌలింగ్‌ చేస్తున్న సమయంలోనే వెన్నునొప్పి వచ్చింది.

దీంతో జట్టు సిబ్బంది వెంటనే అతన్ని ఐసీసీ అకాడమీకి తరలించి ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించారు. రిపోర్ట్స్‌లో వసీమ్‌కు వెన్నునొప్పి తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి అతను ఆసియాకప్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌ ముగిసిన తర్వాత పాకిస్తాన్‌కు బిజీ షెడ్యూల్‌ ఉంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఆ తర్వాత టి20 ప్రపం‍చకప్‌లో ఆడనుంది.

ఈ నేపథ్యంలో మహ్మద్‌ వసీమ్‌కు విశ్రాంతినివ్వడమే కరెక్టని పీసీబీ అభఙప్రాయపడుతోంది. ఇప్పటికే మోకాలి గాయంతో నాలుగు వారాల పాటు ఆటకు దూరమైన షాహిన్‌ అఫ్రిది అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక మహ్మద్‌ వసీమ్‌ పాక్‌ తరపున 11 టి20 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.

చదవండి: ఆఫ్రిది లేకున్నా మాకు ఆ ముగ్గురు ఉన్నారు.. భారత బ్యాటర్లకు సవాల్‌!

Asia Cup 2022: భారత్‌- పాకిస్తాన్‌ ఏ జట్టు ఆటగాడైనా ఒకటే! మేము అన్నదమ్ముల్లా ఉంటాం!

మరిన్ని వార్తలు