రసపట్టులో... ఇంగ్లండ్‌–పాక్‌ తొలి టెస్టు

8 Aug, 2020 04:44 IST|Sakshi

ఇంగ్లండ్‌–పాక్‌ తొలి టెస్టు 

పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 137/8 

ప్రస్తుత ఆధిక్యం 244 పరుగులు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్, పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆసక్తికర మలుపులు తీసుకుంది. బౌలర్లు చెలరేగడంతో మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చిన పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో కుప్పకూలింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అసద్‌ షఫీఖ్‌ (29), రిజ్వాన్‌ (27) మాత్రమే కొద్ది సేపు ప్రతిఘటించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్, స్టోక్స్, బ్రాడ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. బెస్‌కు ఒక వికెట్‌ లభించింది. ప్రస్తుతం పాక్‌ ఓవరాల్‌గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. చివరి రెండు వికెట్లకు మరికొన్ని అదనపు పరుగులు జోడించవచ్చు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 92/4తో తమ తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 219 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్‌ (117 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... జోస్‌ బట్లర్‌ (38) ఫర్వాలేదనిపించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా