పాకిస్తాన్‌ 100/2 

25 Aug, 2020 02:51 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరో 210 పరుగులు చేయాలి. ఫాలోఆన్‌ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (18; 2 ఫోర్లు), అబిద్‌ అలీ (42; 2 ఫోర్లు) అవుటయ్యారు. కెప్టెన్‌ అజహర్‌ అలీ (29 బ్యాటింగ్‌), బాబర్‌ ఆజమ్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అబిద్‌ అలీని అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌ టెస్టు వికెట్ల సంఖ్య 599కు చేరుకుంది. చివరి రోజు అండర్సన్‌ మరో వికెట్‌ తీస్తే టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్‌ బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. టెస్టుల్లో 600 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు మురళీధరన్‌ (శ్రీలంక), షేన్‌ వార్న్‌ (ఆస్ట్రేలియా), అనిల్‌ కుంబ్లే (భారత్‌) స్పిన్నర్లే కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు