T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కు పాక్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

15 Sep, 2022 18:14 IST|Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌-2022కు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. ఈ రెండు ఈవెంట్‌లకు వేర్వేరు జట్లను పాక్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశారు. అమీర్‌ జమీల్‌, అర్బర్‌ ఆహ్మద్‌, మహ్మద్‌ హారిస్‌ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారిగా పాక్‌ జట్టులో చోటు దక్కింది.


 
ఇక పాక్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు విషయానికి వస్తే.. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టుతో పాటు... స్టాండ్‌బైగా ముగ్గురు ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా గాయం కారణంగా ఆసియాకప్‌-2022కు దూరమైన స్టార్‌ పేసర్‌ షహీన్‌ షా ఆఫ్రిది తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విదంగా యువ ఆటగాడు హైదర్‌ ఆలీ తిరిగి జట్టులో చోటు సంపాందించుకున్నాడు. ఇక సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌కు సెలక్టర్లు మరో సారి మొండి చేయి చూపించారు. కాగా పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమాన్‌కు రిజార్వ్‌ జాబితాలో చోటు దక్కడం గమానార్హం. 

టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్

రిజర్వ్‌ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాక్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), అమీర్ జమాల్, అబ్రార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్ని జునీమ్ షా, షానవాజ్ దహానీ, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్


చదవండి: Ind Vs Aus T20 Series: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్‌, జట్లు.. ఇతర వివరాలు!

మరిన్ని వార్తలు