పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన లిటన్‌ దాస్‌..

27 Nov, 2021 13:08 IST|Sakshi

Update: ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్‌ బౌలర్లలో హసన్‌ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్‌ ఆఫ్రిది, ఆస్రఫ్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. మిడిలార్డర్‌ మిడిలార్డర్‌ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్‌, ముష్ఫికర్‌ రహీం  206 పరుగల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో  లిటన్‌ దాస్‌ (114),ముష్ఫికర్‌(91), మెహది హసన్‌ టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.  

తొలి టెస్టులో  తొలి రోజు ఆటముగిసేసరికి  పటిష్ట స్ధితిలో నిలిచిన బంగ్లాదేశ్‌.. రెండో రోజు ఆదిలోనే లిటన్‌ దాస్‌ వికెట్‌ను కోల్పోయింది. హాసన్‌ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 206 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. లిటన్‌ దాస్‌ 11 ఫోర్లు, 1 సిక్స్‌ తో 114 పరుగులు సాధించాడు.

చిట్టగాంగ్‌: పాకిస్తాన్‌తో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఒకదశలో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాను లిటన్‌ దాస్‌ (113 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ముష్ఫికర్‌ (82 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) ఐదో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. 

చదవండి: Shreyas Iyer: డాన్స్ తో ఇరగదీసిన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు