IND Vs SA 4th T20I: 'ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బౌలర్ల ట్రాప్‌లో పడుతున్నాడు'

18 Jun, 2022 13:28 IST|Sakshi

టీమిండియా స్టాండింగ్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఔట్‌ అవుతున్న తీరు కాస్త ఆందోళనకు గురి చేస్తుందని భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో పంత్‌ తీవ్రంగా నిరాశరుస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు సార్లు ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతులకే పంత్‌ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.

2022లో పంత్‌ 16 సార్లు ఔట్‌ కాగా.. అందులో 10 సార్లు వైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతులకే ఔట్‌ కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో కూడా పంత్‌ అదే రీతిలో పెవిలియన్‌కు చేరాడు. "అతడు వరుసగా అన్ని మ్యాచ్‌లో ఒకే విధంగా వికెట్‌ను కోల్పోతున్నాడు. బౌలర్లు అతడికి వైడ్‌ ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తున్నారు.

అతడు ప్రతీ మ్యాచ్‌లోను బౌలర్ల ట్రాప్‌లో పడుతున్నాడు. అతడు రానున్న మ్యాచ్‌ల్లో అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌ను మార్చుకోవాలి" అని వసీం జాఫర్‌ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది.
చదవండి: Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం

మరిన్ని వార్తలు