Paralympics 2021: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు..

31 Aug, 2021 17:54 IST|Sakshi

టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా  భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ T-63 విభాగంలో మరియప్పన్‌‌‌‌‌‌‌‌ తంగవేల్‌‌‌‌‌‌‌‌ భారత్‌కు రజత పతకం సాధించగా,శరధ్‌ కూమార్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్‌ ఖాతాలోకి మొత్తం 10 పతకాలు చేరాయి.

మరియప్పన్‌‌‌‌‌‌‌‌ తంగవేల్‌‌‌‌‌‌‌‌, శరధ్‌ కూమార్‌ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 2016 రియో పారాలింపిక్స్‌లో మరియప్పన్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం సాధించాడు.  పారా ఒలింపిక్స్‌లో  రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్‌ 30వ స్థానంలో ఉంది.

చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్‌ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్‌ బౌలర్‌

మరిన్ని వార్తలు