డిస్కస్‌ త్రోలో కాంస్యం గెలిచినా...

30 Aug, 2021 05:24 IST|Sakshi

పురుషుల అథ్లెటిక్స్‌ డిస్కస్‌ త్రో ఎఫ్‌–52 కేటగిరీలో భారత ప్లేయర్‌ వినోద్‌ కుమార్‌ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. కోసెవిచ్‌ (పోలాండ్‌– 20.02 మీటర్లు) స్వర్ణం... సాండోర్‌ (క్రొయేషియా–19.98 మీటర్లు) రజతం గెల్చుకున్నారు. అయితే ప్రత్యర్థులు వినోద్‌ ఎఫ్‌–52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు చేశారు.

కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయయ లోపం ఉన్నవారు ఎఫ్‌–52 కేటగిరీలోకి వస్తారు. ‘నిర్వాహకులు 22వ తేదీన వినోద్‌ను పరీక్షించి అతను ఎఫ్‌–52 విభాగంలో పోటీపడవచ్చని నిర్ణయించారు. నేడు ఫిర్యాదును సమీక్షించి ఫలితాన్ని ప్రకటిస్తారు’ అని భారత చెఫ్‌ డి మిషన్‌ గురుశరణ్‌ సింగ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు