Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్‌ అదుర్స్‌.. 127 ఏళ్ల తర్వాత

8 Dec, 2021 11:10 IST|Sakshi

Pat Cummins First Captian Take 5 Wickets Haul In Ashes Test Since 1982.. ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ డెబ్యూ కెప్టెన్సీలోనే అదరగొట్టాడు. టిమ్‌ పైన్‌ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్‌ యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తంగా 13.1 ఓవర్లలో 38 పరుగులు.. మూడు మెయిడెన్లతో ఐదు వికెట్లు తీశాడు. ఈ ఐదు వికెట్లలో హసీబ్‌ హమీద్‌, బెన్‌ స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, ఓలీ రాబిన్‌సన్‌, మార్క్‌ వుడ్‌లు ఉన్నారు. తాజా ప్రదర్శనతో కమిన్స్‌ డెబ్యూ టెస్టు కెప్టెన్‌గా రెండు రికార్డులను బద్దలుకొట్టాడు.

►డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్‌ తన తొలి టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఆసీస్‌ క్రికెట్‌ చరిత్రలో రెండోసారి. ఇంతకముందు జార్జ్‌ గిఫిన్‌ 1894లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ డెబ్యూ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీశాడు.మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. మళ్లీ 127 ఏళ్ల తర్వాత పాట్‌ కమిన్స్‌ ఆ ఫీట్‌ను రిపీట్‌ చేయడం విశేషం.

►ఇక యాషెస్‌ సిరీస్‌ పరంగా చూసుకుంటే డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్‌ ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 1982 తర్వాత మళ్లీ ఇప్పుడే. 1982 యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ డెబ్యూ కెప్టెన్‌గా బాబ్‌ విల్లీస్‌ ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు ఘనత సాధించాడు.

చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్‌ స్టార్క్‌

మరిన్ని వార్తలు