కిరాణా కొట్టులా హెచ్‌సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు

13 May, 2021 14:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్‌సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్‌సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్‌సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు.

అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్‌సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్‌సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్‌సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: అజహరుద్దీన్, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల మధ్య వివాదం!

చదవండి: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు

మరిన్ని వార్తలు