PSL 2023: షాహిన్‌ అఫ్రిది చితక్కొటినా తప్పని ఓటమి..

7 Mar, 2023 18:33 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023లోలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ లాహోర్‌ ఖలండర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. మంగళవారం పెషావర్‌ జాల్మీతో జరిగిన మ్యాచ్‌లో లాహోర్‌ ఖలండర్స్‌ 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జట్టు కెప్టెన్‌ షాహిన్‌ అఫ్రిది(36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు), హుస్సేన్‌ తలత్‌(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63) చితక్కొట్టినా ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. పెషావర్‌ జాల్మీ బౌలింగ్‌లో అర్షద్‌ ఇక్బాల్‌, వహాబ్‌ రియాజ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జాల్మీ 19.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సయీమ్‌ అయూబ్‌(36 బంతుల్లో 68), కెప్టెన్‌ బాబర్‌ ఆజం(41 బంతుల్లో 50) రాణించారు. ఇక కొహ్లెర్‌ కాడ్‌మోర్‌ 16 బంతుల్లో 36 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. లాహోర్‌ ఖలండర్స్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టగా, హారిస్‌ రౌఫ్‌, జమాన్‌ ఖాన్‌, రషీద్‌ ఖాన్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: క్రికెట్‌లో కొత్త పంథా.. ఐపీఎల్‌ 2023 నుంచే మొదలు

>
మరిన్ని వార్తలు