Manny Pacquiao: బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్య‌క్ష ప‌ద‌విపై టార్గెట్

29 Sep, 2021 18:39 IST|Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ లెజెండ్ మ్యానీ ప‌కియావో తన బాక్సింగ్ కెరీర్‌కు  వీడ్కొలు పలికాడు. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ నుంచి రిటైర‌వుతున్న‌ట్లు బుధ‌వారం  ట్విట్టర్‌లో వీడియో సందేశం ద్వారా తెలిపాడు. తనను పేదరికం నుంచి ఈ స్ధాయికు తీసుకువచ్చిన బాక్సింగ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉంది అని ప‌కియావో తెలిపాడు. తన రాజకీయ భవిష్యత్తు పై దృష్టి సారించేందుకుఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు.

2022లో ఫిలిప్పీన్స్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న‌ట్లు గ‌తంలో మ్యానీ ప‌కియావో ప్ర‌క‌టించాడు. కాగా అతడు ఫిలిప్పీన్‌లో  సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు చివరిగా క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్‌ ప్రొఫెష‌న‌ల్ ఫైట్‌లో తలపడ్డాడు. ఈ ఫైట్‌లో ప‌కియావో ఓటమి చెందాడు. కాగా తన 26 ఏళ్ల  బాక్సింగ్ కెరియర్‌లో 8 డివిజన్‌ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా ప‌కియావో నిలిచాడు.

చదవండి: Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్‌!

  

>
మరిన్ని వార్తలు