ఐపీఎల్‌ 2021 స్పాన్సర్‌షిప్‌ల జాబితాలో మరో సంస్థ

18 Mar, 2021 21:43 IST|Sakshi

న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 2021 కోసం ఆరు స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తెలిపింది. ఇప్పుడు ఫోన్‌పే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాతో మాత్రమే స్పాన్సర్‌షిప్ కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అనే నాలుగు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఫోన్‌పే స్పాన్సర్ చేస్తోంది. ఫోన్‌పే ఐపీఎల్‌కు సహ-స్పాన్సర్ చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఫోన్‌పే ఐపీఎల్‌ ప్రచారం స్మార్ట్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నడుస్తుందని కంపెనీ తెలిపింది.
 
ప్రస్తుతం ఉన్న 280 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారుల సంఖ్యను డిసెంబర్ 2022 నాటికి 500 మిలియన్లకు విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు & సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.. “వచ్చే నెలలో ఐపీఎల్‌ 2021తో ప్రారంభమయ్యే జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాము. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆరు వేర్వేరు స్పాన్సర్‌షిప్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టాము. ప్రతి భారతీయుడి చెంతకు డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనేది మా ఆశయం. అందుకే మా మార్కెటింగ్ ప్రయత్నాలు దానికి అనుగుణంగా ఉన్నాయి" అని అన్నారు. ఫోన్‌పే అనేది ఒక డిజిటల్ చెల్లింపుల సంస్థ. దీని ద్వారా వినియోగదారులు డబ్బు పంపించడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయడం, దుకాణాలలో డబ్బులు చెల్లించడం చేయవచ్చు. 

చదవండి:

వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! 

మరిన్ని వార్తలు