టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1

19 Dec, 2020 10:28 IST|Sakshi

అడిలైడ్‌ : 4,9,2,0,4,0,8,4,0,1.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతుంది అంతర్జాతీయ మ్యాచ్‌ లేక గల్లీ క్రికెట్‌ అనే అనుమానం కలిగింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగుల వద్దే ముగించింది. టెయిలెండర్‌ మహ్మద్‌ షమీ(1) రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. షమీ మోచేతికి బంతి బలంగా తగలడంతో అతను మైదానాన్ని వీడాడు. 

ఓవరాల్‌గా భారత్‌కు89 పరుగుల ఆధిక్యం దక్కింది.  9/1 క్రితం రోజు స్కోరుతో ఆటను ఆరంభించిన టీమిండియా మూడోరోజు కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 2పరుగులు చేసిన నైట్‌వాచ్‌మెన్‌ బుమ్రా వెనుదిరిగాడు. బుమ్రాతో మొదలైన టీమిండియా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. కేవలం 10 పరుగుల వ్యవధిలో 5 వికట్లు కోల్పోవడం టీమిండియా ఆట తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కమిన్స్‌, హాజల్‌వుడ్‌ పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోయారు. ఆసీస్‌ పేసర్ల దాటికి పుజారా, రహానే, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. టీమిండియా ఆటగాళ్లు ఎవరూ డబుల్‌ డిజిట్‌ను చేరకపోవడం గమనార్హం. ఆసీస్‌ బౌలర్లలో హజిల్‌వుడ్‌ ఐదు వికెట్లు, కమిన్స్‌ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్నిశాసించారు.

మరిన్ని వార్తలు