గోల్‌ కొట్టే అవకాశం.. ప్రత్యర్థి ఆటగాడికి గాయం

24 Nov, 2021 15:21 IST|Sakshi

ఆటలో క్రీడాస్పూర్తి ప్రదర్శించడం సహజం. ఎవరైనా ఆటగాడు గాయపడితే వారికి ధైర్యం చెప్పడం.. లేక సలహాలు ఇస్తుండడం చూస్తుంటాం. తాజాగా ఒక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా గోల్‌ కొట్టే అవకాశం వచ్చినప్పటికి.. అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాడు కండరాలు పట్టేయడంతో నొప్పితో విలవిల్లాడాడు. ఇది చూసిన తన ప్రత్యర్థి బంతిని గోల్‌పోస్ట్‌ వైపు కాకుండా పక్కకు పంపించి.. అతని దగ్గరికి వచ్చి సాయం చేశాడు. ఈ చర్యతో మిగిలిన ఆటగాళ్లు మొదట ఆశ్చర్యానికి లోనైనప్పటికి .. సదరు ఆటగాడు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫిదా అయ్యారు. ఇది ఏ మ్యాచ్‌లో జరిగిందనేది తెలియనప్పటికి.. వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌..

మరిన్ని వార్తలు