PM Modi - Neeraj Chopra: నీరజ్‌ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

24 Jul, 2022 12:36 IST|Sakshi

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి సంచలనం సృష్టించిన భారత జావెలిన్ త్రోయర్‌ నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచపు అత్యుత్తమ అథ్లెట్లలో నీరజ్ ఒకడని కీర్తించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ నీరజ్‌ పతకం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ..

భారత క్రీడల చరిత్రలో ఇదో ప్రత్యేకమైన రోజని అన్నారు. నీరజ్‌.. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో పాటు చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు నీరజ్‌కు అభినందనలు తెలిపారు.

కాగా, అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం బళ్లాన్ని విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా ప్రస్తుత క్రీడల్లో భారత్ తరపున పతకం అందుకున్న తొలి వ్యక్తిగా, అంజూ బాబీ జార్జ్‌ (2003లో కాంస్యం) తర్వాత ఓవరాల్‌గా రెండో భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. 
చదవండి: నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్‌గా రికార్డు
 

మరిన్ని వార్తలు