Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌ విజేతలకు ప్రధాని ఫోన్‌ కాల్‌

30 Aug, 2021 16:54 IST|Sakshi

టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. ఈవెంట్‌లో దేశానికి తొలి స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖారా,  రజతం సాధించిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌ కతునియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు. మోదీ లేఖారాతో మాట్లాడుతూ.. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని ఆమెను అభినందించారు. ప్రధాని మాటల అనంతరం అవని.. దేశ ప్రజల నుంచి తనకు లభించిన మద్దతు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. 

లేఖారా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో మొత్తం 249.6 స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఎఫ్‌56 విభాగంలో రజత పతకం సాధించిన కతునియాను అభినందిస్తూ, ప్రధానీ మోదీ ట్వీట్ చేశారు. అందులో.. యోగేశ్‌ కతునియాది అత్యుత్తమ ప్రదర్శన. అతను మన దేశానికి రజత పతకం తెచ్చినందుకు సంతోషిస్తున్నాను. అతని విజయం వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం ప్రధాని కాల్‌ చేసి.. యోగేశ్‌ విజయానికి భరోసా ఇవ్వడంలో అతని తల్లి చేసిన కృషిని ప్రశంసించారు.

40 ఏళ్లలో రెండుసార్లు స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియా కూడా ఎఫ్ 46 విభాగంలో సోమవారం రజత పతకాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఝజారియాను ప్రధాని అభినందించారు. మోదీ ట్వీట్ చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శన! మా అత్యంత అనుభవజ్ఞులైన అథ్లెట్లలో ఒకరు రజత పతకం సాధించారు. మీరు సాధించిన పతకాలతో దేశం గర్వపడుతుందన్నారు.

చదవండి: Tokyo Paralympics 2021: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట..

మరిన్ని వార్తలు