Commonwealth Games 2022: కామన్‌ వెల్త్ గేమ్స్‌.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

20 Jul, 2022 11:27 IST|Sakshi
కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022,బర్మింగ్‌హామ్,భారత అథ్లెట్ల బృందం

ఇంగ్లండ్‌ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేందుకు బుధవారం మోదీ వర్చువల్‌గా ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.."ఒత్తిడి లేకుండా మీ బలాన్ని నమ్మి బాగా ఆడండి. ఎలాంటి బెదురు, బెరుకు లేకుండా ఆడండి. తికమకపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి" అని అథ్లెట్ల బృందంతో అన్నారు.

ఇక కామన్వెల్త్ గేమ్స్‌కు  322 మంది సభ్యులతో కూడిన బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం  ప్రకటించింది. ఈ బృందంలో 215 మంది అథ్లెట్లు 107 మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. 215 మంది అథ్లెట్లు 19 క్రీడా విభాగాలలో 141 విభిన్నఈవెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించ నున్నారు.
చదవండిWAC 2022: నిరాశ పరిచిన సబ్లే.. 11వ స్థానంతో ముగించి...

మరిన్ని వార్తలు