Tokyo Paralympics: పోరాడండి.. పతకాలు వాటంతటవే వస్తాయి: ప్రధాని మోదీ

17 Aug, 2021 19:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు టోక్యో వేదికగా జరుగనున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒత్తిడికి గురికాకుండా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అథ్లెట్లు పతకాల గురించి ఆలోచించకుండా శక్తి మేరకు పోరాడాలని, పతకాలు వాటంతటవే వస్తాయని ఆయన సూచించారు. పారా అథ్లెట్లు జపాన్‌లో మరోసారి సత్తా చాటాలని ప్రధాని ఆకాంక్షించారు. మీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన అథ్లెట్లంటూ కితాబునిచ్చారు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లలో స్పూర్తి నింపారు. పారా ఒలింపిక్స్‌ కోసం భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం త్వరలో జపాన్‌ బయలుదేరనుంది. అయితే పారా ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 రియో పారా ఒలింపిక్స్‌లో భారత్‌ 2 స్వర్ణ పతకాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించింది. 

చదవండి: నీరజ్‌ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

మరిన్ని వార్తలు