బిషప్‌ టీమ్‌లో ఏడుగురు భారత క్రికెటర్లు..!

15 Oct, 2020 17:05 IST|Sakshi

కెప్టెన్‌గా కీరోన్‌ పొలార్డ్‌..కోహ్లికి నో ప్లేస్‌

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌కు ముందు జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో సత్తాచాటి అక్కడ ఫామ్‌నే ఇక్కడ కొనసాగిస్తున్న పొలార్డ్‌ను దిగ్గజ క్రికెటర్‌ ఇషాన్‌ బిషప్‌ తన ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన మాజీ బౌలర్‌ బిషప్‌.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఫాంటసీ ఐపీఎల్‌ జట్టును ఎంపిక చేశాడు. దీనికి పొలార్డ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బిషప్‌.. ఏడుగురు భారత క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నాడు. (అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్‌)

ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు తమ జట్లను ప్రకటిస్తూ ఉంటారు మాజీలు. ఈ క్రమంలోనే బిషప్‌ కూడా జట్టును ఎంపిక చేశాడు. ఇందులో పొలార్డ్‌ సారథిగా ఉండగా, కేఎల్‌ రాహుల్‌, డుప్లెసిస్‌లను ఓపెనర్లగా తీసుకున్నాడు. ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంచుకోగా, సెకండ్‌ డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు స్థానం కల్పించాడు. హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌లను ఆల్‌రౌండర్ల కోటాలో తీసుకున్న బిషప్‌..ఫాస్ట్‌ బౌలర్లుగా మహ్మద్‌ షమీ, కగిసో రబడ, బుమ్రాలను తీసుకున్నాడు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా యజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేశాడు. కాగా, ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి బిషప్‌ చోటు కల్పించలేదు.  ఈ ఐపీఎల్‌ ఫామ్‌ ఆధారంగా జట్టును ఎంపిక చేశాడు బిషప్‌.(ఐపీఎల్‌ చరిత్రలోనే ‘ఫాస్టెస్ట్‌’ రికార్డు)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు