పూరన్‌ ఫాస్టెస్ట్‌ రికార్డు

8 Oct, 2020 23:06 IST|Sakshi

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ రికార్డు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పూరన్‌ 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇది ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీగా నమోదైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన 202 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(9), ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు సిమ్రాన్‌ సింగ్‌(11)ల వికెట్లను ఆదిలోనే కింగ్స్‌ పంజాబ్‌ కోల్పోగా ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు.

వరుస సిక్స్‌లతో దుమ్మురేపాడు. అభిషేక్‌ శర్మ వేసిన ఏడో ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన పూరన్‌.. అబ్దుల్‌ సామద్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టాడు. అందులో హ్యాట్రిక్‌ సిక్స్‌లు సాధించాడు పూరన్‌. ఈ క్రమంలోనే అర్థ శతకాన్ని పూర్తి చేసుకుని ఈ సీజన్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. కాగా, ఓవరాల్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఇది రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీగా నమోదైంది. 2018లో కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో అర్థ శతకం సాధించిన రికార్డు పంజాబ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డుగా ఉండగా, పూరన్‌ తాజాగా సాధించిన హాఫ్‌ సెంచరీ రెండోదిగా నిలిచింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో  మయాంక్‌, సిమ్రాన్‌లతో పాటు కేఎల్‌ రాహుల్‌(11) కూడా నిరాశపరిచాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(7) రనౌట్‌ అయ్యాడు. పూరన్‌ ఒక్కడే పోరాటం చేస్తున్నా అతనికి సహకారం లభించడం లేదు. 

మరిన్ని వార్తలు