మురిసిపోతూ ఎగిరి గంతులేసింది

19 Oct, 2020 16:02 IST|Sakshi

దుబాయ్‌: క్రికెట్‌లో ఎలాంటి అద్భుతమైన జరగొచ్చు అనడానికి నిన్న కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ప్రధాన మ్యాచ్‌ టై అయితే.. సూపర్‌ ఓవర్‌ ఆడించారు. అది కూడా టై. మళ్లీ సూపర్‌ ఓవర్‌. ఆడేవాళ్లకు, చూసేవాళ్లకు నరాలు తెగిపోయేంత టెన్షన్‌.ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ చివరకు మంచి మజాను అందించడంతో సూపర్‌ సండేగా మారింది. అసలు సూపర్‌ ఓవర్‌కు వెళితేనే ఇరుజట్లు ఎంతలా పోరాడాయే అర్థమవుతుంది. సూపర్‌ ఓవర్‌లో సూపర్‌ ఓవర్‌ అంటే వారు పోరు అసాధారణమనే చెప్పాలి. కింగ్స్‌ పంజాబ్‌-ముంబై ఇండియన్స్‌ల జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌.. అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ను మరిచిపోయేలా చేసింది. నిన్న జరిగిన రెండు మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేలితే,  రాత్రి జరిగిన మ్యాచ్‌ మాత్రం డబుల్‌ ధమాకాను అందించింది. (ముంబైతో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ రికార్డ్)

 ముందు జరిగిన సూపర్‌ ఓవర్‌ టై కావడంతో రెండో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. తొలి సూపర్‌ ఓవర్‌లో ఇరు జట్లు ఐదేసి పరుగులే చేయడంతో రెండో సూపర్‌ ఆడించారు. ఆ సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ను విజయం వరించింది. రెండో సూపర్‌ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేయగా, దాన్ని కింగ్స్‌ ఛేదించింది.  మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌లు బ్యాటింగ్‌కు దిగారు. బౌల్ట్‌  వేసిన తొలి బంతిని గేల్‌ సిక్స్‌ కొట్టగా, ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీశాడు. ఇక మూడో బంతికి అగర్వాల్‌ ఫోర్‌ కొట్టాడు. ఇక నాల్గో బంతికి మరో బౌండరీకి కొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచింది.

మురిసి మెరిసిన ప్రీతిజింటా 
ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం తర్వాత జట్టు సహ యాజమాని ప్రీతి జింటా ఆనందాని అవధుల్లేవు. పంజాబ్‌ గెలిచిన ప్రతీ సందర్భంలోనూ ఆటగాళ్లను ఉత్సాహపరిచే ప్రీతి జింటా.. రెండో సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం వచ్చే వరకూ ఉత్కంఠగా ఎదురుచూశారు. విజయం అంచుల వరకూ వచ్చి కొన్ని మ్యాచ్‌లను పంజాబ్‌ కోల్పోవడంతో ప్రీతి జింటా మళ్లీ ఏమి జరుగనుందో అని ఒత్తిడిలో కనిపించారు. చివరకు పంజాబ్‌ విజయం సాధించడంతో ఇక ఆమె మురిసిపోయారు. ఆ సంతోషంలో ఎగిరి గంతులేశారు. ఆ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్న ప్రీతి.. ‘ మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్‌ ఓవర్లు. ఓ మై గాడ్‌. నేను ఇంకా షేక్‌ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్‌ పంజాబ్‌ బాయ్స్‌ గెలుపు. వాటే గేమ్‌. వాటే నైట్‌.. వాటే ఫీలింగ్‌. టీమ్‌ ఎఫర్ట్‌కు థాంక్యూ. ఇక్కడ టీమ్‌ వర్క్‌ అత్యుత్తమం’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు