'ఆర్యన్‌.. మీ నాన్నను కొనుగోలు చేశాం'

19 Feb, 2021 15:17 IST|Sakshi

చెన్నై వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ 2021‌ మినీ వేలంలో ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడుకు చెందిన బ్యాట్స్‌మన్‌ షారుక్‌ఖాన్‌ను రూ. 5.25 కోట్ల భారీ ధరకు  పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. కేకేఆర్‌ సహా యజమాని షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్న ఈ ఆటగాడి ప్రారంభ ధర రూ.20 లక్షలు కాగా పంజాబ్ కింగ్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ ఆటగాడి కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా పోటీపడటం విశేషం.

అయితే క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగానే ఆర్యన్ ఖాన్ వైపు తిరిగిన ప్రీతి జింటా.. మేము మీ నాన్నను సొంతం చేసుకున్నాం ఆర్యన్‌ అంటూ నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోపై వినూత్న రీతిలో స్పందించారు. అయ్యో షారుక్‌ఖాన్‌ ఇప్పుడే పంజాబ్‌ కింగ్స్‌కు సొంతం అయ్యాడా.. షారుఖ్ ఖాన్ ఇప్పుడు పంజాబ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా వేలం మధ్యలో దొరికిన విరామంలో నటుడు షారుఖ్ ఖాన్‌తో ప్రీతి జింటా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఫొటోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కూడా ఉన్నాడు. ఆర్యన్‌తో పాటు కేకేఆర్‌ సహా యజమాని జూహీచావ్లా కూతురు జాహ్నవి మెహతా కూడా వేలంలో అందరి దృష్టిని ఆకర్షించారు.
చదవండి: 'ఇద్దరు ఐకాన్లతో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు