24 నుంచి ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌

6 Dec, 2020 04:49 IST|Sakshi

జైపూర్‌: ఇప్పటికే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టేబుల్‌ టెన్నిస్, చెస్‌ తదితర క్రీడాంశాల్లో లీగ్‌లు జరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో హ్యాండ్‌బాల్‌ కూడా చేరింది. జైపూర్‌ వేదికగా ఈనెల 24 నుంచి ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) జరగనుంది.  భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయిన తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్‌ రావు ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీలో ఆరు జట్లు (తెలంగాణ టైగర్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్‌ హస్లర్స్, పిట్‌బుల్స్‌ పంజాబ్, బెంగాల్‌ బ్లూస్, కింగ్‌ హాక్స్‌ రాజస్తాన్, యూపీ ఐకాన్స్‌) తలపడతాయి. జనవరి 10న ఫైనల్‌ జరుగుతుంది. ‘ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌తో భారత హ్యాండ్‌బాల్‌ చరిత్రలో నవశకం ఆరంభం కానుంది’ అని జగన్మోహన్‌ రావు తెలిపారు.

మరిన్ని వార్తలు