Prithvi Shaw: నా బ్యాటింగ్‌ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా 

9 Mar, 2022 13:10 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా రంజీల్లో తన బ్యాటింగ్‌ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌ కోల్పోయి టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోయిన పృథ్వీ షా ఇటీవలే ప్రారంభమైన రంజీ ట్రోపీలో​ ముంబై తరపున కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో పృథ్వీ వరుసగా 9, 44, 53 పరుగులు చేశాడు. ఇలా నామమాత్రపు స్కోర్లు చేసిన షా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అదే సమయంలో యష్‌ ధుల్‌, తరువార్‌ కోహ్లి లాంటి ఆటగాళ్లు వరుసపెట్టి సెంచరీలు సాధిస్తున్నారు. టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన రహానే, పుజారాలు కూడా ఒకటి రెండు మినహా పెద్దగా రాణించలేకపోయారు. 

ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా స్పందించాడు. '' నా బ్యాటింగ్‌ చూస్తే నాకే అసహ్యమేస్తోంది. రంజీ సీజన్‌లో నా ప్రదర్శన అంతగా ఆకట్టుకునేలా లేదు. నా దృష్టిలో 40, 50 స్కోర్లు పెద్దగా చెప్పుకోదగినవి కాదు. బ్యాటింగ్‌లో మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటివరకు నేను చేసిన స్కోర్లు మరి అంత తీసిపారేసేవి కాదు.. కానీ ఇది సరిపోదు. బ్యాటింగ్‌లో ప్రూవ్‌ చేసుకోవాలంటే భారీ ఇన్నింగ్స్‌లతో మెరవాల్సి ఉంది. ఐపీఎల్‌ దగ్గరపడడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జాయిన్‌ అవ్వబోతున్నా. ఈ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరిచి టీమిండియాలో మళ్లీ చోటు కల్పించుకోవాలని ఆశపడుతున్నా. ఐపీఎల్‌ కారణంగా రంజీలకు పెద్ద బ్రేక్‌ వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు జరగనున్న ఐపీఎల్‌ జరగనుంది. కాబట్టి ప్రస్తుతానికి నా ధ్యాసంతా ఐపీఎల్‌ పైనే. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత మళ్లీ రంజీలవైపు దృష్టి సారిస్తా'' అంటూ పేర్కొన్నాడు.

కాగా పృథ్వీ షా టీమిండియా తరపున 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐదు టెస్టులు కలిపి 339 పరుగులు సాధించాడు. 6 వన్డేల్లో 189 పరుగులు చేశాడు.

చదవండి: Taruwar Kohli: రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న మరో కోహ్లి.. 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు

ENG vs WI: బంతి అంచనా వేసేలోపే క్లీన్‌బౌల్డ్‌.. షాక్‌ తిన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌

మరిన్ని వార్తలు