ప్రియా మాలిక్‌కు గోల్డ్ మెడ‌ల్‌

25 Jul, 2021 16:09 IST|Sakshi

బుడాపెస్ట్: భారత్‌ రెజ్లర్‌ ప్రియా మాలిక్‌ సంచలనం స్పష్టించింది. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై సత్తాచాటింది. హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి గోల్డ్‌మెడల్‌  కైవసం చేసుకుంది. ప్రియా మాలిక్ 5-0తో బెలారస్‌ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడ వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం క్రీడాభిమానుల‌ను సంతోషానికి గురిచేస్తుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగట్‌, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజ‌య‌మై సోష‌ల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు