'కోహ్లిని ఉదాహరణగా తీసుకోమని చెప్పా'

21 May, 2021 22:14 IST|Sakshi

ముంబై: ప్రియా పూనియా ఇటీవల తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ బారినపడిన పూనియా తల్లి సరోజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. అయితే బీసీసీఐ పూనియాను ఇంగ్లండ్‌ టూర్‌కి ఎంపిక చేశారు. జూన్ 2న భారత మహిళల జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ.. తల్లి కోల్పోయిన బాధలో ఉన్న పూనియాకు ఆమె తండ్రి సురేందర్‌ ధైర్యం చెప్పారు. తనలో స్ఫూర్తి నింపేందుకు విరాట్ కోహ్లీని ఉదాహరణగా చూపినట్లు ఆమె తండ్రి వెల్లడించాడు.

''ఇంగ్లండ్ టూర్‌ కోసం ప్రియా పూనియాలో నేను స్ఫూర్తి నింపాలనుకున్నా. ఈ క్రమంలో తండ్రిని కోల్పోయినా రంజీ మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లి గురించి నేను చెప్పాను. నిజమే.. మా ఫ్యామిలీకి ఇది చాలా క్లిష్ట పరిస్థితి. కానీ.. మానసికంగా మేము ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. జీవితంలో కూడా ఇలా సవాళ్లని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రియా పరిస్థితుల్ని అర్థం చేసుకుంది. నా కూతురు టీమిండియాకు ఆడేందుకు సిద్ధమని చెప్పింది'' అని పేర్కొన్నాడు.


జూన్ 2న టీమిండియా పురుషుల జట్టుతో పాటు ఇంగ్లండ్‌కి వెళ్లనున్న భారత మహిళల జట్టు.. అక్కడ ఇంగ్లండ్‌తో జూన్ 16న ఏకైక టెస్టు, ఆ తర్వాత జూన్ 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనుంది.
చదవండి: గబ్బర్‌ ఉన్నాడుగా.. ఇక వేరేవాళ్లు ఎందుకు?

టీమిండియా మహిళా క్రికెటర్‌ ఇంట్లో విషాదం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు