PSL 2022: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌పై కరోనా పంజా..

25 Jan, 2022 19:02 IST|Sakshi

కరాచీ: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ 2022పై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌లో పాల్గొనబోయే నలుగురు క్రికెటర్లు సహా ఆ దేశ దిగ్గజ బౌలర్‌, కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ ప్రెసిడెంట్‌ వసీం అక్రమ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ నెల 27 నుంచి ప్రారంభంకావాల్సిన లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

కోవిడ్‌ బారిన పడిన ఆటగాళ్లలో పెషావర్ జల్మీకి చెందిన వాహబ్ రియాజ్, హైదర్ అలీ ఉన్నారు. అంతకుముందు ఇదే ఫ్రాంచైజీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్‌లకు కూడా కరోనా వచ్చింది. వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాగా, కొద్ది రోజుల క్రితం వివిధ ఫ్రాంచైజీలకు చెందిన  ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది వైరస్ బారిన పడినట్లు పీసీబీ గతంలో ప్రకటించింది.
చదవండి: 145 కిమీ పైగా స్పీడ్‌తో బౌల్‌ చేసే ఆ బౌలర్‌ని ఏ జట్టైనా కోరుకుంటుంది.. కేఎల్‌ రాహుల్‌

మరిన్ని వార్తలు