PSL 2023: పరుగుల సునామీకి, శతకాల మోతకు పాక్షిక విరామం

12 Mar, 2023 20:28 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో పరుగుల సునామీకి, శతకాల మోతకు కాస్త బ్రేక్‌ పడింది. ఈ సీజన్‌లో గత కొన్ని మ్యాచ్‌లుగా అతి భారీ స్కోర్లు, విధ్వంసకర శతకాలు నమోదవుతూ వస్తుండగా.. ఇవాళ (మార్చి 12) ఇస్లామాబాద్‌ యునైటెడ్‌-పెషావర్‌ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో పరుగుల ప్రవాహానికి, శతక్కొట్టుడుకు పాక్షిక విరామం దొరికింది.

ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. ఛేదనలో ఇస్లామాబాద్‌ 166 పరుగులకే చాపచుట్టేసి 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గత కొన్ని మ్యాచ్‌ల తరహాలో ఎలాంటి మెరుపులు లేకపోగా.. బౌలర్లు ఆధిపత్యం చలాయించి అందరినీ ఆశర్యర్యపరిచారు.

పెషావర్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ హరీస్‌ (79) ఒక్కడే మెరుపు హాఫ్‌సెంచరీతో అలరించగా.. భానుక రాజపక్ష (41) పర్వాలేదనిపిం‍చాడు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో హసన్‌ అలీ 3, షాదాబ్‌ ఖాన్‌ 2, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ఫహీమ్‌ అష్రాఫ్‌, మహ్మద్‌ వసీం జూనియర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఛేదనకు దిగిన ఇస్లామాబాద్‌.. జల్మీ బౌలర్లు ఖుర్రమ్‌ (1.4-0-13-3), సూఫియాన్‌ (3/37), అమెర్‌ జమాల్‌ (2/28), జేమ్స్‌ నీషమ్‌ (2/23) ధాటికి 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇస్లామాబాద్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్‌ అష్రాఫ్‌ (38), రహ్మానుల్లా గుర్భాజ్‌ (33), షాదాబ్‌ ఖాన్‌ (25) ఓ మోస్తరుగా రాణిం‍చారు. 

పీఎస్‌ఎల్‌-2023లో గత కొన్ని మ్యాచ్‌ల్లో స్కోర్ల వివరాలు..  

ముల్తాన్‌ సుల్తాన్స్‌: 262/3 (ఉస్మాన్‌ ఖాన్‌ 43 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120)
క్వెట్టా గ్లాడియేటర్స్‌: 253/8 

పెషావర్‌ జల్మీ 242/6
ముల్తాన్‌ సుల్తాన్స్‌ 244/6 (రిలీ రొస్సొ 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121)

లాహోర్‌ ఖలందర్స్‌ 226/5 (ఫకర్‌ జమాన్‌ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115)
ఇస్తామాబాద్‌ యునైటెడ్‌ 107 

పెషావర్‌ జల్మీ 240/2 (బాబర్‌ ఆజమ్‌ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115)
క్వెట్టా గ్లాడియేటర్స్‌ 243/2 (జేసన్‌ రాయ్‌ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 145 నాటౌట్‌)


 

మరిన్ని వార్తలు