PSL: ఒక్క ఓవర్‌లో 33 పరుగులు.. దెబ్బకు ప్లేఆఫ్‌ బెర్త్‌

20 Jun, 2021 11:15 IST|Sakshi

అబుదాబి: పాకిస్తాన్‌ సూపర్‌లీగ్‌(పీఎస్‌ఎల్‌-6)లో శనివారం కరాచీ కింగ్స్‌, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కరాచీ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ వరకు ఆ జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 136గా ఉంది. కానీ తర్వాతి ఓవర్‌ ముగిసేసరికి జట్టు స్కోరు 169గా మారింది. దీనికి కారణం.. కరాచీ కింగ్స్‌ ఆటగాడు దానిష్‌ ఆజిజ్‌ పవర్‌ హిట్టింగ్‌. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఆజిజ్‌ 4,6,6,6,6(నో బాల్‌),2,2 తో విధ్వంసం సృష్టించాడు. అతని ధాటికి  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దానిష్‌ ఆజిజ్‌ (13 బంతుల్లో 45 పరుగులు; 5 సిక్సర్లు, 2 ఫోర్లు)తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షార్జీల్‌ ఖాన్‌ 45, వాల్టన్‌ 34* పరుగులతో అతనికి సహకరించారు.


అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులకే పరిమితమై 14 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఈ విజయంతో కరాచీ కింగ్స్‌ ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. గ్లాడియేటర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.  కరాచీ కింగ్స్‌, లాహోర్‌ ఖలందర్స్‌ 10 పాయింట్లతో సమానంగా ఉన్నా.. కరాచీతో పోలిస్తే నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా లేకపోవడంతో లాహోర్‌ ఖలందర్స్‌ భారంగా టోర్నీని వీడాల్సి వచ్చింది.

చదవండి: వార్న్‌కు స్పిన్‌ పాఠాలు.. నవ్వాపుకోలేకపోయిన సెహ్వాగ్‌

పీఎస్‌ఎల్‌: ఉస్మాన్‌ ఖవాజా మెరుపు సెంచరీ.. 11 ఏళ్ల రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు