తొలి ప‌రుగు కోసం 36 బంతులు.. పుజారాపై మీమ్స్‌ వర్షం

20 Jun, 2021 17:39 IST|Sakshi

సౌతాంప్టన్‌: టీమిండియా న‌యా వాల్ చతేశ్వర్‌ పుజారా ఆటతీరు ఈ మ‌ధ్య భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. అతను అసలైన టెస్ట్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పటికీ.. కొన్ని సార్లు పరగులు చేయడానికి మరీ ఎక్కువ బంతులు తీసుకోవడం.. జట్టు ప్రయోజనాలకు తగ్గట్టుగా ఆడకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోపాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు.


టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ భారత జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్‌ శర్మ (34), శుభ్‌మన్‌ గిల్‌ (28) శుభరంభం ఇచ్చారు. ఓపెనర్లు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పుజారా తొలి ప‌రుగు చేయ‌డానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మ‌రో ఫోర్ కొట్టిన అత‌డు చివ‌రికి 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా, పుజారా ఇన్నింగ్స్‌పై ట్విట‌ర్‌లో జోకులు పేలుతున్నాయి. ఫ‌న్నీ మీమ్స్‌తో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు.

చదవం‍డి: WTC Final: 250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి..

మరిన్ని వార్తలు