IPL 2022 Auction: మెగావేలానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌కు మరో బ్యాడ్‌న్యూస్‌.. 

12 Feb, 2022 11:16 IST|Sakshi

ఐపీఎల్‌ మెగావేలానికి అంతా సిద్దమవుతున్న వేళ పంజాబ్‌ కింగ్స్‌కు ఒక బ్యాడ్‌న్యూస్‌. పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతిజింటా ఈసారి మెగావేలానికి అందుబాటులో ఉండదంట. ఇది బ్యాడ్‌న్యూస్‌ ఏంటని ఆశ్యర్యపోకండి.  ఇంతకముందు ఎప్పుడు వేలం జరిగినా ప్రీతిజింటా ప్రత్యేక ఆకర్షణగా కనిపించేది. తనదైన చలాకీ నవ్వుతో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటే ఎంతో సందడిగా ఉండేది. మరి అలాంటి నవ్వులు మిస్సవుతున్నామంటే కచ్చితంగా అది బ్యాడ్‌న్యూసే కదా... 

ప్రీతిజింటా మెగావేలానికి దూరమైన కారణాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.'' ఈ ఏడాది ఐపీఎల్‌ మెగావేలానికి దూరం కాబోతున్నా. ఈ విషయం చెప్పడానికి కాస్త బాధగా ఉన్నప్పటికి తప్పదు. ఈ మధ్యనే మేం కవల పిల్లలకు జన్మనిచ్చాం. కాలిఫోర్నియాలో ఉంటున్న నేను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పిల్లలను వదిలి ఇండియాకు రాలేను. వాడి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి వేలానికి దూరంగా ఉండబోతున్నా. ఈసారి పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ కొత్తగా ఉండబోతున్న సంగతి మాత్రం చెప్పగలను. అందుకు ఇప్పటికే క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి అభిప్రాయాలు సేకరించాం. మరి ఈసారి రెడ్‌ జెర్సీ వేసుకోనున్న ఆటగాళ్ల కోసం నేను ఎదురుచూస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది.  

ఇక ఈసారి మెగావేలంలో పాల్గొంటున్న పంజాబ్‌ కింగ్స్‌ పర్స్‌లో రూ.72 కోట్లు ఉన్నాయి. మయాంక్‌ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను మాత్రమే రిటైన్‌ చేసుకుంది. కేఎల్‌ రాహుల్‌ సహా మిగతా ఆటగాళ్లందరిని రిలీజ్‌ చేసింది. దీంతో ఈసారి వేలంలో పంజాబ్‌ కింగ్స్‌  జట్టులో కొత్త ఆటగాళ్లు కనిపించడం ఖాయం. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, డికాక్‌లతో పాటు మహ్మద్‌ షమీలను భారీ ధరకు సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
 

మరిన్ని వార్తలు