Men's Hockey: పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా

5 Aug, 2021 12:51 IST|Sakshi

హాకీ జట్టు పంజాబ్ ఆటగాళ్లకు భారీ నజరానా

 కోటి  రూపాయల చొప్పున నజరానా ప్రకటించిన సర్కార్

సాక్షి, న్యూఢిల్లీ:  టోక్యో ఒలింపిక్స్‌లో విజయ  దుందుభి మోగించిన  టీమిండియా హాకీ జట్టులో తమ ఆటగాళ్లకు పంజాబ్‌ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జర్మనీతో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో విజయంతో కాంస్య పతకం సాధించిన జట్టులో రాష్ట్రానికి చెందిన హాకీ జట్టు ఆటగాళ్లకు  కోటి రూపాయల  నగదు  పురస్కారాన్ని  ఇవ్వనున్నట్టు సర్కార్‌ వెల్లడించింది. పంజాబ్ క్రీడా మంత్రి రాణా గుర్మిత్ సింగ్ సోధి ఈ ప్రకటన చేశారు. ఇండియన్ హాకికి ఇదొక చారిత్రాత్మక రోజని ఆయన ట్వీట్‌ చేశారు. మరింత ఉన్నతమైన గోల్డ్‌ మెడల్‌తో తిరిగి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు.

మరోవైపు భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహం రీడ్, సహాయక కోచ్ పియూష్ దుబేలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీఫోన్‌లో సంభాషించారు.  ఈ సందర్బంగా జట్టులోని సభ్యులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోదీ. కాగా టోక్యో ఒలింపక్స్‌ జర్మనీతో గురువారం జరిగిన మ్యాచ్‌ భారత్‌ టీం 5-4 తేడాతో విజయం సాదించింది. తద్వారా కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు, 41 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్‌ పతకాన్ని సాధించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు