క్వార్టర్స్‌లో సింధు

22 Jan, 2021 06:06 IST|Sakshi

బ్యాంకాక్‌: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  భారత స్టార్‌ షట్లర్‌ 21–10, 21–12తో కిసొనా సెల్వడ్యురె (మలేసియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ... డెన్మార్క్‌ ఆటగాడు రస్మస్‌ గెంకెను వరుస గేముల్లో 21–12, 21–9తో చిత్తు చేసి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్‌ 17–21, 18–21తో మలేసియాకు చెందిన లియూ డారెన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 21–18, 23–21తో ఏడో సీడ్‌ చొయి సొల్గి యు–సి సియంగ్‌ జె (కొరియా) జంటకు షాకిచ్చింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌–అశ్విని పొన్నప్ప జోడీ 22–20, 14–21, 21–16తో జర్మనీకి చెందిన మార్క్‌ లమ్స్‌ఫుస్‌–ఇసాబెల్‌ హెర్ట్‌రిచ్‌ జంటను ఓడించి ముందంజ వేసింది. అర్జున్‌–ధ్రువ్‌ కపిల జంట ప్రిక్వార్టర్స్‌లో 9–21, 11–21తో బెన్‌ లెన్‌–సియాన్‌ వెండి (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో ఓడింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు