PV Sindhu: భారత్‌ క్రీడల్లో సూపర్‌ పవర్‌గా ఎదగగలదు..

11 Feb, 2022 11:03 IST|Sakshi

PV Sindhu Comments At MCRHRD: భారత బ్యాడ్మింటన్‌ స్టార్, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) డీజీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హర్‌ప్రీత్‌ సింగ్‌ జ్ఞాపిక అందజేశారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో సివిల్‌ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

ఆపై ముఖాముఖీ చర్చలో పాల్గొన్న సింధు...మన వద్ద అందుబాటులో ఉన్న ప్రతిభను చూస్తే భారత జట్టు క్రీడల్లో సూపర్‌ పవర్‌గా ఎదగగలదని, ఇందు కోసం తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు సంయుక్తంగా చిన్నారులను ఆటల వైపు మళ్లించాలని సూచించారు.

సెమీఫైనల్లో సాకేత్‌ జోడీ 
బెంగళూరు: రామ్‌కుమార్‌ రామనాథన్‌తో జతకట్టిన తెలుగు ఆటగాడు సాకేత్‌ మైనేని బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఈ జోడీ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికీ సింగిల్స్, డబుల్స్‌లో చుక్కెదురైంది. డబుల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సాకేత్‌–రామ్‌కుమార్‌ జంటకు ప్రత్యర్థి జోడీ స్టీవెన్‌ డీజ్‌ (కెనడా)–మలెక్‌ జజిరి (ట్యునిషియా) నుంచి వాకోవర్‌ లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం... జే క్లార్క్‌ (బ్రిటన్‌)–మార్క్‌ పోల్మన్స్‌ (ఆ్రస్టేలియా)తో తలపడుతుంది.

మరో క్వార్టర్స్‌లో బ్రిటన్‌–ఆ్రస్టేలియన్‌ జోడీ 6–2, 6–1తో భారత టాప్‌సీడ్‌ జీవన్‌ నెడుంజెళియన్‌–పూరవ్‌ రాజా జంటపై గెలిచింది. సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రజ్నేశ్‌ గుణేశ్వర్‌ 6–3, 2–6, 1–6తో టాప్‌సీడ్‌ జిరి వెసెలే (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ఎర్లెర్‌ (ఆస్ట్రియా)–విట్‌ కొప్రివా (చెక్‌ రిపబ్లిక్‌) 6–4, 6–3తో యూకీ బాంబ్రీ–దివిజ్‌ శరణ్‌ జంటపై నెగ్గింది. నాలుగో సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం 4–6, 7–6 (7/2), 4–10తో హ్యూగో గ్రెనియర్‌–ముల్లెర్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓటమి పాలయ్యింది. 

చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా

మరిన్ని వార్తలు