సింధు ముందంజ

4 Mar, 2021 06:21 IST|Sakshi

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–16, 21–19తో నెస్లిహాన్‌ యిజిట్‌ (టర్కీ)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 18–21, 21–18, 21–11తో సమీర్‌ వర్మ (భారత్‌)పై, సౌరభ్‌ వర్మ 21–19, 21–18తో కిర్చ్‌మెర్‌ (స్విట్జర్లాండ్‌)పై, అజయ్‌ జయరామ్‌ 21–12, 21–13తో థమాసిన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 21–18, 19–21, 21–16తో క్రిస్టోఫర్‌–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్‌)లపై... మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–5, 21–19తో అనాబెల్లా –స్టిన్‌ కుస్‌పెర్ట్‌ (జర్మనీ)లపై గెలిచారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు