రిటైర్మెంట్‌ పోస్టు.. స్పందించిన పీవీ సింధు

6 Nov, 2020 13:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాడ్మింటన్‌ ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు ఇటీవల పీవీ సింధు సోషల్‌ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నాచివరి ఆట అని’ ట్విటర్‌ వేదికగా ప్రకటించడంతో గందరగోళం రేగింది. సింధు చేసిన ఈ ట్వీట్‌పై అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే వెంటనే సింధు మరో మూడు పేజీల ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ కారణంగా వ్యాప్తి చెందిన నెగిటివిటీ, భయం నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అసలు విషయం వెల్లడించారు. కలిసి కట్టుగా కోవిడ్‌ను ఓడించాలని, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఈ పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన పీవీ సింధు

తాజాగా ఈ పోస్టుపై పీవీ సింధు స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్‌ పోస్టు కారణంగా అందరు కాస్తా ఆశ్యర్యానికి గురయ్యారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అసలు ఏం జరిగిందని తనను అడగడం మొదలు పెట్టారని, ట్వీట్‌ పూర్తిగా చదవాలని అప్పుడు వారికే అర్థం అవుతుందని చెప్పినట్లు పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా ఏర్పడిన ప్రతికూలతను తొలగించాలనేది తన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అందరం మరింత సంసిద్ధంగా ఉండి, కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలని సూచించారు. ప్రస్తుతం పీవీ సింధు లండన్‌లో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ కోసం నేష‌న‌ల్ క్యాంపులో శిక్ష‌ణ తీసుకుంటున్న సింధు ఉన్నట్టుండి లండ‌న్‌కు వెళ్లడం అప్పట్లో కొన్ని అనుమానాల‌కు తావిచ్చింది. న్యూట్రిష‌న్ ప్రోగ్రామ్‌లో భాగంగా తాను లండ‌న్‌కు వెళ్లిన‌ట్లు సింధు త‌న ట్విటర్‌లో వెల్లడించారు. చదవండి: ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే..

మరిన్ని వార్తలు