PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం

1 May, 2022 10:37 IST|Sakshi

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఘనత సాధించాలని ఆశించిన భారత స్టార్‌ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో సింధు రెండోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. 2014లో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకం నెగ్గిన ఈ ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి ఈసారీ సెమీఫైనల్‌ అడ్డంకిని దాటలేకపోయింది.

గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో పీవీ సింధు పోరాడి ఓడింది. తొలి గేమ్ లో పీవీ సింధు అలవోకగా విజయం సాధించింది. ఇక రెండో గేమ్ లో యామగుచి పుంజుకోవడంతో మ్యాచ్ హోరా హోరీగా సాగింది. అయితే మ్యాచ్ రిఫరీలు సింధు విషయంలో ప్రవర్తించిన తీరు ఇక్కడ వివాదాస్పదంగా మారింది. 

రెండో గేమ్ లో స్కోర్లు 14-12తో సింధు లీడ్ లో ఉన్న సమయంలో అంపైర్లు సింధు కు ఒక పాయింట్ ను పెనాల్టీగా విధించారు. సింధు సర్వీస్ చేసే సమయంలో ఎక్కువగా టైమ్ తీసుకుంటుందనే కారణంతో అంపైర్లు సింధుకు ఒక పాయింట్ ను పెనాల్టీగా ప్రకటించారు. దీనిపై సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాసేపు అంపైర్లతో వాగ్వివాదానికి కూడా దిగింది. అనంతరం సింధు ఆట గాడి తప్పగా.. అద్బుతంగా ఆడిన యామగుచి ఆ గేమ్‌ గెలవడంతో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు