శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పీవీ సింధుకు ఘన స్వాగతం

4 Aug, 2021 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. నిన్న ఢిల్లీ చేరుకున్న పీవీ సింధు అక్కడి నుంచి ఈ రోజు (బుధవారం) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సింధుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. సింధు రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నుంచి ఆమె నేరుగా ఫిలింనగర్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది. ఇక మంగళవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించిన సంగతి కూడా తెలిసిందే.

మరిన్ని వార్తలు