Singapore Open 2022: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..!

17 Jul, 2022 12:22 IST|Sakshi

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం(జూలై 17) జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యిపై 21-9,11-21,21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్‌లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్‌లో ఓడిపోయింది.అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి  సూపర్‌ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

కాగా వాంగ్ జి యి చివరి వరకు అద్భుతమైన రీతిలో పోరాడింది. ఇక పీవీ సింధుకు ఈ ఏడాది సీజన్‌లో ఇది మూడో టైటిల్‌. అంతకుముందు సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్‌లో  సూపర్‌ 300 టైటిల్స్‌ను సింధు సాధించింది. ఇక ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారత ప్లేయర్‌గా  సింధు రికార్డులకెక్కింది.  కాగా గతంలో 2010లో సైనా సెహ్వాల్, 2017లో సాయి ప్రణీత్  సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.
చదవండి: Commonwealth Games 2022: 322 మందితో కూడిన జంబో టీమ్‌ను ప్రకటించిన భారత ఒలింపిక్‌ సంఘం

మరిన్ని వార్తలు