SA20 2023: డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా క్వింటన్ డికాక్‌

28 Nov, 2022 19:17 IST|Sakshi

దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌ వచ్చే ఏడాది జనవరి 10న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ లీగ్‌కు సంబంధించిన వేలంను కూడా క్రికెట్‌ సౌతాఫ్రికా పూర్తి చేసింది. అదే విధంగా ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి.

ఇక ఇది ఇలా ఉండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను ఎంపిక చేసింది. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్ ప్రకటించింది. కాగా డర్బన్‌ ఫ్రాంచైజీనీ ఐపీఎల్‌కు చెందిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది.

అయితే ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు డికాక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో డర్బన్ సూపర్ జెయింట్స్ సారథిగా డికాక్‌ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన వేలంలో జాసన్ హోల్డర్, డ్వైన్ ప్రిటోరియస్ వంటి స్టార్‌ ఆటగాళ్లను డర్బన్ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

A post shared by Durban's Super Giants (@durbanssupergiants)

డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు: క్వింటన్ డి కాక్, ప్రేనెలన్ సుబ్రాయెన్, జాసన్ హోల్డర్, కైల్ మేయర్స్, రీస్ టోప్లీ, డ్వైన్ ప్రిటోరియస్, హెన్రిచ్ క్లాసెన్, కీమో పాల్, కేశవ్ మహరాజ్, కైల్ అబాట్, జూనియర్ డాలా, దిల్షన్ మధుశంక, జాన్సన్ చార్లెస్, మాథ్యూ బ్రీట్జ్కేర్, క్రిస్టియన్ జోంకర్ వియాన్ ముల్డర్, సైమన్ హార్మర్‌
చదవండి: FIFA World Cup 2022: సెర్బియాకు చుక్కలు చూపించిన ఆఫ్రికా జట్టు.. మ్యాచ్‌ 'డ్రా'

మరిన్ని వార్తలు