'ఇంగ్లండ్‌కు బూమ్‌బాల్‌ చూపించాడు.. నేను అతడికి వీరాభిమానిని'

11 Feb, 2024 12:41 IST|Sakshi

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. బుమ్రా తన పేస్‌ పదునుతో తొమ్మిది వికెట్లు (6/45; 3/46) పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

అనంతరం ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో బుమ్రా సత్తాచాటాడు. బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 881 పాయింట్లతో అగ్రస్ధానానికి బుమ్రా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా తన పేస్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌కు చెక్‌ పెట్టాడని అశ్విన్‌ కొనియాడాడు.

"వైజాగ్‌ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌కు జస్ప్రీత్‌ బూమ్‌బాల్‌ అంటే ఏంటో చూపించాడు. ఈ సిరీస్‌లో అతడు 14 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. అదేవిధంగా ఇటీవలే టెస్టు బౌలర్లలో అ‍గ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం అంత ఈజీగా కాదు.

ఇది నిజంగా చాలా పెద్ద ఘనత. నేను అతడికి వీరాభిమానిని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. తొలుత మూడో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని మూడో టెస్టుకూ భాగం చేశారు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: #Jalaj Saxena: 37 ఏళ్ల వయస్సులో అద్బుతం.. ఏకంగా 9 వికెట్లు! సంజూ ఫుల్‌ హ్యాపీ

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega