రాఫెల్‌ నాదల్‌కు చుక్కెదురు

1 Jan, 2023 05:50 IST|Sakshi

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ 2022 సంవత్సరాన్ని ఓటమితో ముగించాడు. సిడ్నీలో జరుగుతున్న యునైటెడ్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ టోర్నీలో భాగంగా శనివారం బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌ 0–2తో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంకర్‌ నాదల్‌ 6–3, 3–6, 4–6తో 14వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరీ చేతిలో ఓడిపోయాడు. గతంలో నోరీతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో నాదల్‌ ఈ బ్రిటన్‌ ప్లేయర్‌ చేతిలో తొలిసారి ఓడిపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు