అదే పాంటింగ్‌ నాతో చెప్పాడు: రహానే

3 Nov, 2020 18:28 IST|Sakshi

అబుదాబి: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించడంతో టాప్‌-2కు చేరింది. అదే సమయంలో ఆర్సీబీ కూడా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఢిల్లీ 19 ఓవర్‌లో గెలవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ బెర్తుకు ఢోకా లేకుండా పోయింది. ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఢిల్లీ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  అజింక్యా రహానే(60; 46 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించి విజయానికి బాటలు వేశాడు. కాగా, మ్యాచ్‌ తర్వాత రహానే మాట్లాడుతూ.. పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. క్రికెట్‌ అంటేనే ఫన్నీగా ఉంటుందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమన్నాడు.  (ప్లీజ్ ఆ నిబంధనను తప్పనిసరి చేయండి : సచిన్‌)

ఇక ఈ సీజన్‌ ఆరంభానికి ముందు తమ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పిన విషయాన్ని రహానే గుర్తుచేసుకున్నాడు. ‘ నీకు మూడో స్థానంలో బ్యాటింగ్‌ బాగుంటుందని రికీ చెప్పాడు. ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయడం నీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నాడు.  ఆర్సీబీతో మ్యాచ్‌లో మూడో స్థానంలో రాణించడం సంతోషంగా ఉంది. కానీ విజయానికి చేరువగా వచ్చిన తర్వాత నేను ఔట్‌ కావడం నిరాశ కల్గించింది. నేను గేమ్‌ను ఫినిష్‌ చేయాలనుకున్నా. ఒక్కోసారి మ్యాచ్‌ ఆకస్మికంగా ఛేంజ్‌ అయిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్‌ కాస్త నాలో ఉంది. కానీ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరడమే కాకుండా రెండో​ స్థానాన్ని దక్కించుకోవడం శుభపరిణామం’ అని రహానే తెలిపాడు. ఇక సరైన సమయంలో రహానే ఫామ్‌లోకి వచ్చాడంటూ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ప్రశంసించాడు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించడమే కాకుండా స్టైక్‌ రొటేట్‌ చేస్తూ సింగిల్స్‌, డబుల్స్‌ కూడా బాగా తీశాడన్నాడు. తన అనుభవంతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడని అయ్యర్‌ కొనియాడాడు.

మరిన్ని వార్తలు