T20 WC 2022 Final: ఇంగ్లండ్‌- పాక్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దు అయితే?

11 Nov, 2022 12:56 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(నవంబర్‌ 13)న మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్‌ పోరులో పాకిస్తాన్‌- ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి పాక్‌ ఫైనల్లో అడుగు పెట్టగా.. రెండో సెమీఫైనల్లో భారత్‌పై ఘన విజయం సాధించి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరుకుంది.

అయితే ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో 95 శాతం కురిసే అవకాశం ఉందని బ్యూరో ఆఫ్‌ మెట్రాలజీ వెల్లడించింది. "ఆదివారం మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌ జరిగే సమయంలో 95 శాతం భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం సమయంలో గంటకు 25 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి" అని బ్యూరో ఆఫ్‌ మెట్రాలజీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫైనల్‌ రద్దు అయితే?
కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం‍ కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్‌ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్‌ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.
చదవండి: Kohli Emotional Post: మా కల నేరవేరలేదు.. చాలా బాధగా ఉంది! కోహ్లి భావోద్వేగం

మరిన్ని వార్తలు