మళ్లీ పరుగుల మోత మోగేనా?

27 Sep, 2020 19:08 IST|Sakshi

షార్జా:  ఐపీఎల్‌-13లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో  రాజస్తాన్‌ రాయల్స్‌  టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. ముందుగా కింగ్స్‌ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలవగా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఆడిన ఒకదాంట్లోనూ విజయం సాధించింది. ఇరుజట్లు  తాము గెలిచిన మ్యాచ్‌ల్లో రెండొందలకు పైగా స్కోర్‌ సాధించాయి.  ఆర్సీబీతో మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 206 పరుగులు సాధించగా, ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ 216 పరుగులు చేసింది. దాంతో నేటి మ్యాచ్‌లో పరుగుల మోత ఖాయంగా కనబడుతోంది.(చదవండి: నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్‌)

రాజస్తాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ పంజాబ్‌ జట్ల మధ్య ఇప్పటివరకూ 19 మ్యాచ్‌లు జరిగాయి.  ఇందులో రాజస్తాన్‌ రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్‌ పంజాబ్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపును అందుకుంది. ఇక ఇరుజట్ల మధ్య ముఖాముఖి మ్యాచ్‌ల పరంగా అత్యధిక స్కోరు 221.ఆ స్కోరు కింగ్స్‌ పంజాబ్‌ పేరిట ఉంది. ఇరు జట్ల మధ్య అత్యధిక స్కోరుల్లో రాజస్తాన్‌ రాయల్స్‌ 211 పరుగులు చేసింది.

రాహుల్‌ వర్సెస్‌ ఆర్చర్‌
కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో  కేఎల్‌ రాహుల్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ కాగా, రాజస్తాన్‌ రాయల్స్‌లో ప్రధాన బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌. వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఆర్చర్‌ 22 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడగా, 27 వికెట్లు సాధించాడు. ఆర్చర్‌ ఎకానమీ 7.47గా ఉంది. మరొకవైపు రాహుల్‌  ఐపీఎల్‌ రికార్డు అమోఘంగా ఉంది. తన ఐపీఎల్‌ కెరీర్‌లో రాహుల్‌ 69 మ్యాచ్‌లు ఆడి 2, 130 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. రాహుల్‌ స్టైక్‌రేట్‌ 140.22గా ఉంది. (చదవండి:ఊరిస్తున్న సన్‌రైజర్స్‌ టైటిల్‌ సెంటిమెంట్‌!)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు