నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్‌

17 Apr, 2022 05:41 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్‌ సభ్యుడు హర్భజన్‌ సింగ్‌ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్‌ ‘ట్విటర్‌’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్‌ ఇటీవల పంజాబ్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

మరిన్ని వార్తలు